Monday, 20 February 2017

తెలుగు వెలుగు



*🦁తెలుగదేల యన్న దేశంబు తెలుగేను*
*తెలుగు రేడ నేను తెలుగొకండ*
*ఎల్లవారు వినగా ఎరుగనే బాసాడి*
*దేశభాష లందు తెలుగు లెస్స*
*.........శ్రీకృష్ణ దేవరాయలు*

*🦁సంస్కృతంబులోని చక్కర పాకంబు*
*అరవ భాష లోని అమృత రాశి*
*కన్నడంబులోని కస్తూరి వాసన*
*కలిసి పోయే తేట తెనుగునందు*
*...........మిరియాల రామకృష్ణ*

*🦁భాషలలో తలమానికం ,మన భావాలకి అక్షర రూపం ,మన జీవితాలతో విడదీయలేని బంధం ,మనసుకీ మాటకీ అనుసంధానం ......మాతృభాష మన భాష .ఉన్న ఊరూ ,కన్నతల్లీ ,మాట్లాడే భాష  సర్వదా శ్లాఘనీయం .*

*🌍జి.కే టుడే 🌍*

*🦁ప్రపంచం లో అందమైన లిపి ఉన్న తొలి భాష కొరియా ..రెండవది తెలుగు .*

*🦁ప్రపంచంలో  మాట్లాడే భాషల లో  తెలుగు స్థానం పదహారు* .

*🦁తెలుగు లో రాయబడిన మొదటి శ్లోకం  నన్నయ్య మహాభారతాన్ని అనువదిస్తూ మొదట రాసిన ప్రార్ధన 'శ్రీవాణీ గిరిజాశ్చిరాయ '  అంటూ త్రిమూర్తులు ,వారి భార్యలను వర్ణించిన శ్లోకం*

*🦁తెలుగు కి మూల భాష బ్రాహ్మీ లిపి అని కృష్ణా జిల్లా లో లభించిన భట్టిప్రోలు శాసనం వలన తెలుస్తోంది .*

*🦁మన దేశం లో ఉన్న ఇండో -ఆర్యన్ ,ద్రావిడ భాషా కుటుంబాలలో తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది .*

*🦁షోడశ మహాజనపదాలలో తెలుగు ప్రాంతం పేరు అస్మక రాజ్యం .దీనికి రాజధాని ప్రస్తుత నిజామాబాద్ జిల్లా లోని బోధన్.*

*🦁1953 లో తొలిసారి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని కర్నూల్ .రాయలసీమ ,కోస్తా ఆంధ్ర మాత్రమే ఇందులో భాగాలు .*

✍✍✍🏆🏆🏆✍✍✍

No comments:

Post a Comment